పరకాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్
పరకాల, పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల,ఏనుమాముల పట్టణంలో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏనుమాముల పోలీసులు తెలిపారు.ఏనుమాముల రాపోలు రామకృష్ణ నివాసం సంజీవ నగర్ కాలనీ ధవలేశ్వరం, పప్పుల సంపత్ నివాసం గోరి కొత్తపల్లి, మరియు కేతిరి కిరణ్, నివాసం గోరి కొత్తపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను వీరు ముగ్గురు స్నేహితులు తాగుడుకు అలవాటు పడి వీరు ముగ్గురు ప్రతిరోజు బీర్లు తాగుతూ బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేసేవారు ఈ మధ్యలో డబ్బులు ఇబ్బందిగా ఉండడంతో ఎలాగైనా సరే డబ్బులు సులువుగా సంపాదించాలని, అనుకొని ఏదైనా దొంగతనం చేయాలని ముగ్గురు నిర్ణయించుకుని పరకాల లోని ముదిరాజ్ కాలనీ లో తేదీ నాలుగు రెండు 2024 రోజున ఒక ఇంటికి తాళం వేసి ఉండగా దాని తాలం పగలగొట్టి బీరువాలో ఉన్న ముద్ద బంగారం ఒక జత చెవి కమ్మలు రెండు చేతి గాజులు బంగారు సత్యనారాయణ స్వామి విగ్రహం వెండివి సిల్వర్ గణపతి లక్ష్మీ సరస్వతి వెండి బొమ్మలు నగదు పదివేల రూపాయలు వాటిని మొత్తం పప్పుల సంపత్ దగ్గర పెట్టి తరువాత సుమారు వారం రోజులకు పరకాల లోని ఆదర్శనగర్ లో ఇంటికి తాళం వేసి ఉండగా దాని తాళం పగలగొట్టి అందులోకి వెళ్లి ఏడు కుంకుమ భరణిలు వెండివి వెండి గిన్నెలు ఒక వెండి గ్లాసు దొంగిలించుకొని వెళ్లి కేతిరి కిరణ్ దగ్గర పెట్టి తర్వాత వారం సుమారు వారం రోజులకు ఏనుమాముల శివారులోని ఆరెపల్లి గ్రామంలో బుర్రి వసంతరావు దంపతులు చెన్నైలోని తన కూతురింటికి తేదీ 8 2 2024 రోజున వెళ్లగా, తేదీ 18 224 రోజున ముగ్గురు కలిసి పప్పుల సంపత్ యొక్క ద్విచక్ర వాహనంపై బుర్రి వసంతరావు ఇంటికి వెళ్లి ఎవరూ లేనిది చూసి తలుపు తాళం పగలగొట్టగా తాళం పగలనందున గడ్డపారతో కిచెన్ లోని గ్రిల్స్ ని పగలగొట్టి లోపలికి వెళ్లి కబోర్డ్ లో ఉన్నటువంటి రెండు తులాలు గల బంగారు నెక్లెస్ ఒకటి, ముద్ద బంగారం రెండు తులాలు నగదు 1500 రూపాయలు దొంగిలించుకుని పోయి గోరుకొత్తపల్లి లో ఉండి 28-2-2024 మేము చేసిన దొంగతనాలకు సంబంధించి అన్ని వస్తువులను అమ్ముకొని సమానంగా పంచుకుందామని వరంగల్ కు వస్తూ ఉన్న క్రమంలో ఏనుమాముల లోని కార్ల మార్క్స్ నగర్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడగా మొత్తం చోరీ సొత్తు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో..1) రాపోలు రామకృష్ణ తండ్రి పేరు ప్రసాద్, వయసు: 22 సంవత్సరములు, కులం; కాపు, వృత్తి; కూలి( తాపీ మేస్త్రి) డోర్ నెంబర్ 4-180/6, సంజీవ్ నగర్ కాలనీ,ధవలేశ్వరం(గ్రా), రాజమండ్రి(R) (M), తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. 2) పప్పుల సంపత్ తండ్రి పేరు రాజయ్య, వయసు 39 సంవత్సరములు, కులం: మున్నూరు కాపు, వృత్తి; ఆటో డ్రైవర్, R/o గోరి కొత్తపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. 3) కేతిరి కిరణ్ తండ్రి పేరు రాజయ్య, వయసు; 27 సంవత్సరాలు, కులం; ఎరుకల, వృత్తి; తాపీ మేస్త్రి, R/o గోరి కొత్తపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. దొంగతనం చేసిన ఇండ్ల వివరాలు: 1) బుర్రి వసంతరావు, నివాసం; ఆరేపల్లి ఏనుమాముల. 2) ఉమామహేశ్వర్ అనంతుల, నివాసం; పరకాల. 3) పొన్నగంటి సుజిత్ కుమార్, నివాసం; పరకాల గురువారం పై అధికారుల ఉత్తర్వుమేరకు ఏనుమాముల సిఐ, పి కిషన్, సిసిఎస్ సిఐ శంకర్ నాయక్, ఎస్సై, పి శ్రీకాంత్ సిసిఎస్ ఎస్సై సంపత్ కుమార్ సి సి ఎస్ మరియు ఏనుమాముల సిబ్బంది. వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్ మార్క్స్ నగర్ వద్ద ఇట్టి నేరస్తులను పట్టుకోవడం జరిగింది ఇట్టి కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేదించిన సిఐ పి కిషన్, 2/3 సీఐ శంకర్ నాయక్, ఎస్ ఐ పి శ్రీకాంత్, సి సి ఎస్ ఎస్సై సంపత్ కుమార్, హెచ్ సిమున్నా, వేణు రవి వెంకన్న ఏనుమాములసిబ్బంది, హెచ్ సి కిరణ్, మహేందర్, విజయ్, యుగంధర్, రవీందర్ లను సి సతీష్ బాబు, ఎసిపి మామునూరు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.