అపరిష్కృతంగా ఉన్న మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించండి
భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం, 29(పిసిడబ్ల్యూ న్యూస్): కొత్తగూడెం స్థానిక హెడ్ ఆఫీస్ ఎదుట మైనింగ్ స్టాఫ్ సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కె రాజ కుమార్,అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య, పాల్గొని మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న మైనింగ్ స్టాప్ సమస్యలు మరియు ఈ మధ్య విడుదల చేసిన నోటిఫికేషన్ లో మైనింగ్ స్టాఫ్ సిబ్బందిని అండర్ మేనేజర్ సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ పొంది ఉన్న వారికి కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్థానం కల్పించాలని వారికి కూడా ఇ.టీ.ఓ అండర్ మేనేజర్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.అంతర్గతంగా వీరు సెకండ్ క్లాస్ సర్టిఫికెట్ పొంది ఉన్నప్పటికీ కూడా వీరికి పదోన్నతులు కల్పించకుండా ఎక్స్టర్నల్ నుంచి యం.జి.టి అండర్ గ్రౌండ్ ఉద్యోగాలకు పిలవటాన్ని వ్యతిరేకిస్తూ వివిధ ఏరియాల నుండి వచ్చి ధర్నాలో పాల్గొన్న మైనింగ్ స్టాప్ సిబ్బంది, యాజమాన్యాన్ని పదోన్నతులు కలిగించాలని డిమాండ్ చేశారు. జిఎం పర్సనల్ కి మెమొరండం ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకట్,ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరస్వామి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ అడ్వైజర్ శేషయ్య ,ఏరియా సెక్రటరీ మల్లికార్జున్, సుశీల్, దాసరి వెంకటేష్,మందమర్రి నుండి రాజేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీరాంపూర్ నుండి బాబు,బాలకృష్ణ, గోదావరిఖని నుండి మహేందర్ అన్వేష్ రెడ్డి, మణుగూరు నుండి రాంగోపాల్, ధవళత్, భూపాలపల్లి నుండి మురళి ఇల్లందు నుండి వివేక్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ తదితరులు పాల్గొన్నారు.