చిట్యాల, ఫిబ్రవరి 28 (పిసిడబ్ల్యూ న్యూస్) : అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల సిఐ దాసరపు వేణు చందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరపు వేణుచందర్ ఆధ్వర్యంలోని బుధవారం ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 9 ట్రాక్టర్ల. జడల పేట క్రాస్ రోడ్డు వద్ద మరియు కైలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను చిట్యాల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. 9 ట్రాక్టర్లను మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన బందెల శివ బండ శ్రీకాంత్ బందెల నరసయ్య బందెల రమేష్ పెరుమాండ్ల క్రాంతి రేగొండ మండలం రామన్నగూడెం కి చెందిన బానోతు వీరు గుగులోతు సమ్మయ్య రేగొండ మండల కేంద్రానికి చెందిన పట్టే కోటిలింగం బండి శ్రీనివాస్ రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన గంజి రజనీకాంత్ నవాబుపేటకు చెందిన సాదరాజు చిట్యాలకు చెందిన దేవా సతీష్ కుమార్ గోపాలపూర్ కు చెందిన కొడారి శివకుమార్ లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఎండి షాఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ మధుసూదన్ హెడ్ కానిస్టేబుల్ యాకన్న సురేందర్ గౌడ్ పోలీసు సిబ్బంది బాలకృష్ణ ,అస్లాం ,నవీన్, లింగన్న ,ప్రశాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.