Saturday, March 7, 2026

ఐసిడిఎస్ కార్యాలయం లో జరుగుతున్న అక్రమాలపై విచారణ

మంథని, ఫిబ్రవరి 26 (పిసిడబ్ల్యూ న్యూస్): మంథని ఐసిడిఎస్ కార్యాలయం లో జరుగుతున్న అక్రమాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జాన్సీ లక్ష్మీబాయి మంథని కార్యాలయంలో సోమవారం విచారణ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు కొంతమంది సూపర్వైజర్లు చేసిన ఫిర్యాదు పై విచారణకు వచ్చినట్లు వెల్లడించారు. స్వరూప అనే సూపర్వైజర్ జనవరిలో విధులకు హాజరు కాకపోయినా జీతం చెల్లించారని ఫిర్యాదులో పేర్కొనడంతో కమిషనర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు వచ్చినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం నివేదికను కమిషనర్ కు అందజేస్తామన్నారు.

Related Articles

Latest Articles