సంగెం, ఫిబ్రవరి25(పిసిడబ్ల్యూ న్యూస్): వరంగల్ జిల్లా గీసుగొండ మండలం పోలీస్ స్టేషన్ లో ఇటీవల నూతన పదవి బాధ్యతలు చేపట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబులాల్ ను ఆదివారం రోజున స్థానిక జర్నలిస్టుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.సిఐని కలిసిన వారిలో ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ వేల్పుల అనిల్ యాదవ్, పి సి డబ్ల్యూ న్యూస్ రిపోర్టర్ మచ్చిక వీరస్వామి గౌడ్,పబ్లిక్ న్యూస్ రిపోర్టర్ సిద్ద నాగరాజు,తదితరులు ఉన్నారు.