మినీ మేడారం.. మేన్ గుడారమైంది -పెద్ద వాగు చెంత జనం చింతలు -మహా జాతరను తలపింపజేసింది -జాతరలో భద్రత కరువు
మొగుళ్ళపల్లి, ఫిబ్రవరి 23 (పిసిడబ్ల్యూ న్యూస్): వీరవనితలు దేవుళ్ళుగా అవతరించిన మినీ మేడారం జాతరలు జన సందోహంగా మారాయి. మొగుళ్ళపల్లి మండలంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతంలోని పెద్దవాగు ప్రాంతం జన గుడారంగ మారింది. వాగు వద్ద జనం చిందులు వేయడం ఆకర్షణీయంగా మారింది. మహా జాతరను తలపింప చేసే విధంగా భక్తజన సందోహం మొక్కులను సమర్పించుకోవడం గమనార్హం. దీంతో మినీ మేడారం మేన్ గుడారంగా మారింది. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్న వివిధ మండలాలకు చెందిన గ్రామాల లక్ష మంది భక్తులు వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్నారు. భద్రత చర్యలు శూన్యం మొగుళ్ళపల్లి జాతరలో పోలీసు భద్రత చర్యలు శూన్యం. భారీగా తరలివచ్చిన జనంతో రోడ్డు వారగా వాహనాలు నిలిపివేయడంతో జనం అవస్థలకు గురయ్యారు. ఆయన భక్తులు ఇబ్బందులను సైతం తట్టుకొని మొక్కులు చెల్లించుకోవడం విశేషం.