హనుమకొండ, ఫిబ్రవరి 23 (పిసిడబ్ల్యూ న్యూస్): మహాలక్ష్మి పథకంతో పాటు మహిళలకు పార్లమెంట్ టికెట్స్ కేటాయించాలని సామాజిక న్యాయ వేదిక హనుమకొండ జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ అన్నారు. సామాజిక న్యాయ వేదిక హన్మకొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తెలంగాణలో యువత బలిదానాలకు చలించి తెలంగాణ ఇచ్చిన తల్లిగా ప్రజలు భావిస్తారు. సోనియా గాంధీ మాట అ కుటుంబ త్యాగ నిరతి తెలంగాణ ప్రజలకు ఆదర్శం రాయపూర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో మహిళా జనాభా దామాషా ప్రకారం మహిళలకు చట్ట.సభలలో సీట్లు కేటాయిస్తామని చెప్పిన మాటకు దేశ ప్రజలు హర్షించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సోనియమ్మ మాట దేశప్రజలకు ఆదర్శం రాయపూర్ ప్లీనరీలో మహిళా దామాషా ప్రకారం పార్లమెంట్ లో మహిళలకు సీట్లు కేటాయించి కాంగ్రెస్ పార్టీ మాటను నిలబెట్టాలనీ ఆయన కోరారు. మహాలక్ష్మి పథకం ప్రకారం మహిళలకు చట్ట సభలలో సీట్లు కూడా కేటాయిస్తామని అని మహిళలు ప్రజలు భావించాలి అప్పుడే సోనియా మాటకు విలువ గౌరవం ఉంటుంది రాష్ట్ర నాయకత్వం సోనియమ్మ మాట ను కచ్చితంగా అమలు చేయాలని సామాజిక న్యాయ వేదిక హన్మకొండ జిల్లా అధ్యక్షులు దామెరుప్పుల శంకర్ రాస్త్రనాయకత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అక్రమ పద్ధతుల్లో కోట్లు సంపాదించిన వారికి పార్లమెంట్లో టికెట్స్ ఇచ్చి ప్రజా స్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చ వద్దని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుచున్నారు. మహిళలకు టికెట్స్ ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించాలని కోరారు. ఈ కార్య్రమంలో జిల్లా కార్యదర్శి రావుల రవీంద్ర నాథ్ ముదిరాజ్, బైరబోయిన సురేందర్ యాదవ్, sk గౌస్ పాషా, వలపదాసు రమేష్ తదతరులు పాల్గొన్నారు.