బంగాళాఖాతం లో అధిక పీడనం కారణంగా నేటి నుంచి వర్షాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (పిసిడబ్ల్యూ న్యూస్): శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా తేమ గాలులు వీస్తాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కేస్తాలో, ఈ నెల 24 నుంచి రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.