Thursday, April 3, 2025

వేమిరెడ్డికి సంఘీభావం తెలిపిన జనసేన హరికుమార్ రెడ్డి

నెల్లూరు, ఫిబ్రవరి 21 (పిసిడబ్ల్యూ న్యూస్): వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి పార్టీకి రాజ్యసభకు మరియు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో, సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకుడు గుడిహరి కుమార్ రెడ్డి తన ముఖ్య అనుచరులతో విపిఆర్ నివాసం వద్ద కలసి శాలువాతో సత్కరించి పూల బొకేలతో సన్మానించారు. జనసేన నాయకుడు హరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి మృదుస్వభావి, స్నేహశీలి, అజాతశత్రువు రాజకీయాలకే వన్నెతెచ్చారు, విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. వేమిరెడ్డి వ్యక్తి కాదు శక్తి, ఆయన రాజకీయాల్లోకి రాకమునుపే పలు రకాల సేవ కార్యక్రమాలు వాటర్ ప్లాంట్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, స్వచ్ఛంద సేవ సంస్థలు స్థాపించి ప్రజలకు దగ్గరయ్యారు. ఇటువంటి నాయకుడికి కూడా వైసీపీలో అవమానాలు తప్పలేదు. ఈయనకు మేము పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా అభిమానులం, రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించేందుకు తొలి అడుగు మీదే కావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజవర్గం చిరంజీవి యువత మరియు పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు లోకేష్, శ్రీకాంత్, బుచ్చి మాధవ్, మోహన్ రెడ్డి, మాధవరెడ్డి, వెంకీ, ఆశ్వక్, ఖలీల్, నాయా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles