జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి– ములుకలపల్లి రెండు గ్రామాల మధ్య భక్తి శ్రద్దలతో జరుగుతున్న శ్రీ మినీ మేడారం జాతర అశేష భక్తజనంతో వీనులవిందుగా జరుగుతున్నందున. జాతరకు వస్తున్న భక్తుల సౌకర్యార్ధం ఉచిత మంచినీటి వసతిని మొగుళ్లపల్లి ఎస్ బి ఐ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు ఏర్పాటుచేసి ప్రారంభించామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ.మొగుళ్లపల్లి, ములుకలపల్లి శ్రీ సమ్మక్క సారాలమ్మ వనదేవతలు కొలువుదీరిన జాతరకు వచ్చి మొక్కలు సమర్పించుకుంటున్న భక్తులకు ఉచితంగా మంచినీరు ఎస్ బి ఐ ద్వారా అందించి భక్తుల దాహర్తిని తీర్చడం అనందంగా ఉందని అందుకు సహకరించిన జాతర ఉత్సవ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. నడిగోటి రాము,తక్కల్లపల్లి రాజు, క్యాతరాజు రమేష్, మహమ్మద్ రఫీ,ఫీల్డ్ ఆఫీసర్. రవీందర్ రెడ్డి, ఓదెలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.