Thursday, April 3, 2025

నూతన జాతీయ విద్యావిదానం 2020ని రద్దు చేయాలి. -ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అజాద్

ఖమ్మం, ఫిబ్రవరి 22(పిసిడబ్ల్యూ న్యూస్): ఈనెల 25,26వ తేదీలలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అజాద్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయకరణ, కార్పొరేటీకరణను ప్రేరేపిస్తూ మనువాద సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం-2020ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నదని అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాని అఖిల భారత విద్యార్థుల సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈయొక్క కార్యక్రమంలో బుద్ధి జీవులు మేధావులు, ప్రొఫెసర్లు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు రెండు రోజులపాటు ఈ సదస్సులో పాల్గొని నూతన జాతీయ విద్యవిధానం -2020 వలన బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య వ్యవస్థలో జరిగే నష్టాలను వారు ఈ చర్చలో వివరిస్తారని వారు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కోర్డినేటర్ చార్వక మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేశారనీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ -2020తో పాటు నూతన విద్యా పాఠ్య ప్రణాళిక-2023ను తీసుకొచ్చి స్వేచ్ఛ, సమానత్వం, లౌకితత్వం అనే రాజ్యాంగ విలువల స్థానంలో మనుధర్మన్ని అమలుచేసే ప్రయత్నము చేస్తున్నారుని అందులో భాగంగానే డార్విన్ సిద్ధాంతాన్ని తొలిగిస్తాం, హెడ్గేవర్ పాఠాన్ని ప్రవేశ పెడతాం అని చెప్తున్నారని, భారత రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టే ప్రమాదం ఉందనీ అలాగే విద్యకాషాయికరణ, కార్పొరేటికరణ చేస్తూ పెద, బడుగు బలహీన తరగతి వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్న ఇట్లాంటి సందర్భంలో దేశ వ్యాప్తంగా విద్యార్థులందరిని ఏకం చేసి సమాన, శాస్త్రీయ విద్య కావాలని, అంద విశ్వసలను పెంచే విద్య విధానాలు వెనక్కి తీసుకోవాలని వారు మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి ప్రభాకర చారి, భారత్ బచావో విద్యార్థి నాయకులు శ్రావణ్, గణేష్, ప్రశాంత్, సనత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles