Thursday, April 3, 2025

కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం..

పరకాల మునిసిపాలిటీకి నూతన కమిషనర్ గా విధుల్లోకి చేరిన నరసింహ ని గురువారం రోజు వయోవృద్ధుల సంక్షేమ సంఘం పరకాల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు పరకాల చారిత్రక పర్యాటక స్థలమైన అమరధామం లో ఉన్న సమస్యలను విన్నవించి వినతి పత్రం సమర్పించారు. పరకాల పట్టణానికి తలమానికంగా నిలిచిన అమరధామం ఒక చారిత్రక చిహ్నం అట్టి ప్రదేశం నిరాధారణకు గురైందని విగ్రహాలు రంగులు వెలిసిపోయి బీటలు వాడుతున్నాయని పునాది గోడలు పగుళ్లు చూపుతున్నాయని మునిసిపల్ కమిషనర్ కు సీనియర్ సిటిజన్స్ సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అమరధామం ఆవరణలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఓపెన్ జిమ్ లో పాడైన పరికరాలను మరమ్మతు చేయించాలని అదేవిధంగా పరకాల మునిసిపాలిటీ నుండి నిధులు కేటాయించి అమరధామం మరమ్మతులు చేపట్టి మనకు నిలిచిన ఏకైక చారిత్రక చాన్నాన్ని పదులపరుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ పరకాల గౌరవాధ్యక్షులు బూసి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షులు రేపాల నరసింహ రాములు ప్రధాన కార్యదర్శి కోడెపాక సమ్మయ్య కోశాధికారి ఎడ్ల సుధాకర్ సహాయ కార్యదర్శి బాణాల మొగిలయ్య ఉపాధ్యక్షులు పోరండ్ల కైలాసం కార్యవర్గ సభ్యులు రేగూరి రాఘవరెడ్డి ముదురుకోళ్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles