ఏర్పాట్లు పూర్తి అన్ని శాఖల అధికారులు అమ్మవార్ల సేవలో విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రివ్యూలో అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ
ఆత్మకూర్, ఫిబ్రవరి 21 : (పిసిడబ్ల్యూ న్యూస్): మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే జాతరకు లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగా అన్ని శాఖల అధికారులు గత 15 రోజుల నుంచి పనులలో పూర్తిగా నిమగ్నమై, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వం తరఫున 59.65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో జాతరకు కావలసిన ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు పూర్తి చేశారు. జాతర ప్రారంభానికి ముందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, జాతర విజయవంతనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పదేపదే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశానుసారంగా అన్ని శాఖల అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండి, పనులు పూర్తి చేసి భక్తులకు, మెరుగైన సౌకర్యాలు కల్పించారు.ముదిరాజులే ఇక్కడ పూజారులు శతాబ్ది కాలం నుంచే ఇక్కడ వన దేవతలను సాంప్రదాయ గిరిజన పద్ధతిలో సమ్మక్క సారలమ్మ దేవతలను గద్దెలకు అగమనం చేయడం జరుగుతుంది. వంశంపారంపర్యంగా ముదిరాజులే పూజారులుగా ఉంటూ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరను నడిపిస్తున్నారు. ప్రధాన పూజారులు సమ్మక్క పూజారి గోనెల సారంగపాణి, సారలమ్మ పూజారి గోనెల వెంకన్న, పూజారులు గుల్లపల్లి సాంబశివరావు, గోనెల రవీందర్, సహాయ పూజారులు ఉడుతనబోయిన గోవర్ధన్, రేగుల సునీత, సిరిపురి లక్ష్మి మహిళా పూజారులు ఉన్నారు.