కాంట్రాక్టు నిర్లక్ష్యానికి అధికారుల అండతో ప్రజాధనం వృధా..
నడికుడ, ఫిబ్రవరి 21 (పీసీడబ్ల్యూ న్యూస్): మండల కేంద్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మహిళా సమైక్య భవనం నిర్మాణంలో నాణ్యత లోపించిందని నడికూడ గ్రామ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మంగళవారం నడికుడలో నూతనంగా కట్టిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాలను కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ల నవీన్, నాయకులు రాజేశ్వరరావు, ఓ బి సి జిల్లా కోఆర్డినేటర్ బొమ్మ చంద్రమౌళి, వాంకె రాజయ్య, నారగాని కుమారస్వామి, అట్టెం బాబు ,నవీన్ ,తల్లపళ్లి యుగేందర్ ,దుప్పటి అయిలయ్య,దుప్పటి కృష్టపర్ తదితర నాయకులు పరిశీలించారు .అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ ప్రజాపాలన కోసం ప్రజాధనంతో కట్టిన గ్రామపంచాయతీ భవనం కట్టిన కొన్ని రోజులకే పాడవడం మొదలవుతుందని అన్నారు. కొన్ని సంవత్సరాల పాటు మన్నికతో ఉండాల్సిన గ్రామపంచాయతీ భవనం నెలలు గడవకముందే గదుల్లో కుంగడం మొదలవుతుందని అన్నారు .అంతే కాకుండా వెనకాలే కట్టిన మహిళా సమాఖ్య భవనం బేస్మెంట్ పిల్లర్ వద్ద పగుళ్లు రావడం జరుగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులన్నీ నాసిరకంగానే ఉన్నాయని వారు ఆరోపించారు. నాణ్యత ప్రమాణాలు చూడాల్సిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అండతో పనులు పనులు చేశామా బిల్లులు తీసుకున్నామా అన్న చందంగా పనులు జరిగాయని వారు విమర్శించారు .ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోని గ్రామపంచాయతీ మహిళ సమాఖ్య భవనాలను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు పత్రిక ముఖంగా జిల్లా అధికారులను కోరారు.