సంగెం, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): మెట్టుపల్లి చైతన్య గీతాలు పుస్తకావిష్కరణ జరిగింది, రచయిత, సంగెం యంపిటీసి, మెట్టుపల్లి మల్లయ్య రాసిన పుస్తకాన్ని శుక్రవారం రైతు వేదిక కార్యక్రమం రచయిత, ఉపాధ్యాయులు చిలువేరు శ్రీనివాసులు నిర్వహించడం జరిగింది. ఆచార్య బన్న ఐలయ్య, ఎంపీపీ కందగట్ల కళావతి చేతుల మీదుగా ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తల్లి లక్ష్మి యాదగిరి అందజేయడం జరిగింది. ఆచార్య బన్న ఐలయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి రచనలు చేయాలని కోరారు 101 పాటలు పుస్తకము ఆవిష్కరణ శుభ పరిణామం అన్నారు.ఎంపీపీ కందగట్ల కళావతి మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యమని మనుషుల్లో నిద్రాణమైన పాటలు య బయటకు తెచ్చి సమాజానికి విచ్చేసిన రచయితలు పని చేస్తారన్నారు రచయితలు తమ కాలిన ఆర్థిక, సామాజిక అంశాలను ప్రభావ శీలమైన కొత్త ఆలోచనలతో సామాజిక బాధ్యతగా రచనలు చేయాలన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మల్లయ్య ను అభినందించి పాటలు సమాజ చైతన్యానికి ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్ష ఉపాధ్యాయులు ఓ కొమురయ్య, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీటీసీల ప్రోరం అధ్యక్షులు నరసింహ స్వామి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కందగట్ల నరహరి,ఎంపీటీసీ మొండ్రాయి రాణీమొగిలి, మెట్టుపల్లి కొమురయ్య, ఉపాధ్యాయులు ఆనందం, కాసం.క్రాంతి, జ్యోతి ,భవాని, రణధీర్,ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.