సంగెం, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): సంగెం మండలంలో,సీఐటీయూ , ఏ ఐ ఎఫ్ టి యు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోనె రామచందర్ భావన నిర్మాణం కార్మిక సంఘం అధ్యక్షులు దుపాకి రాజు హమాలి సంఘం అధ్యక్షులు ఉండేటి స్వామి లు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్, మచ్చతో విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతిఘటనకు కోలుకోవాలని మోడీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక వర్గం దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని ఈ కోడలు అమలులోకి వస్తే కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలుకుతుందని సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు ప్రశ్నార్థకంగా మారుతుందని 8, పని విధానం పోయి రోజుకు 12 గంటలు పనిచేసే విధంగా చట్టం లో సవరణలు తీసుకొస్తుందని పెరుగుతున్న నిత్యవసర ధరలను అరికట్టాలని ఢిల్లీలో చేస్తున్న రైతాంగం పోరాటంపై జరుగుతున్న పోలీస్ దమన కాండను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీల మేరకు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని రైతు సంఘాలు కార్మిక సంఘాలు అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య,శోభన్, బాబు, శంకర్, అశోక్, కొర్నేలు ప్రవీణ్,ఏలియా, కృష్ణ,రాజేష్, యశోద, కోరమ్మ,తదితరులు పాల్గొన్నారు.