ఆత్మకూరు, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): ఆత్మకూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతన బాధ్యతలు స్వీకరించిన సిఐ ఆర్ సంతోష్ ని ఆత్మకూరు మండలం కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కలిసినవారు జిల్లా నాయకుడు రేవూరి జెలంధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరీటి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ నాగేల్లి సామెల్, ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ చిమ్మరి దేవరాజ్, ప్రధాన కార్యదర్శి అలువాల రవి, అయోధ్య, తదితరులు కలిశారు.