అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైన ప్రభును ఘన సన్మానం చేసిన టి జి పి ఏ నాయకులు
ఇటివల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో 45 ప్లస్ విభాగంలో హైమర్ త్రో లో ద్వితీయ స్థానం పొంది వెండి పతకం అందుకున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందినకి జి హి బి వి అంబాల ప్రభాకర్(ప్రభు)ను టి జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటి దార మధు ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట లోని ప్రభు ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా టి జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు మాట్లాడుతూ అంబాల ప్రభు ఒక సామాజిక కార్యకర్తగా,గొప్ప చిత్రకారుడిగా,ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన డప్పు వాయిద్య కారునిగా,గాయకుడిగా,ఒక జర్నలిస్టుగా ఈ ప్రాంతంలో రెండు దశబ్దాలుగా ఈ ప్రాంతంలో అన్ని రంగాలలో అత్యంత ప్రతిభను కనబరిచి దళిత రత్న,నేషనల్ కళా రత్న అవార్డు గ్రహీతగా,నంది అవార్డు గ్రహీతగా అనేక అవార్డ్స్ అందుకోవడం ఈ నేల చేసుకున్న పుణ్యమే అని అభివర్ణించారు.అదే విధంగా అంబాల ప్రభాకర్(ప్రభు) తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కావడం మా సంఘానికి గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలు తైవాన్ దేశంలో జరిగే పోటీలలో కూడ తనదైన శైలిలో ప్రతిభను కనబరిచి ఈ దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి జి పి ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శ్రీనివాస్,జిల్లా కోశాధికారి సదిరపు శంకర్,రవీందర్ లు పాల్గొన్నారు.