Saturday, March 7, 2026

పరకాలలో చోరీ.. క్లూస్ టీం విచారణ

పరకాల, ఫిబ్రవరి 14 (పిసిడబ్ల్యూ న్యూస్): హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మంగళవారం రాత్రి ఉదంతం సంచలనం సృష్టించింది. పరకాల పట్టణంలోని సగర వీధి సమీపంలో గల అనంతుల ఉమామహేశ్వర్ ఇంటిలో దొంగతనం జరిగింది. నగదు రూపాయలతో పాటు దేవతల విగ్రహాల వద్ద పెట్టిన వెండి, బంగారం అభరణాలు అపహరణకు గురైనాయి. ఈ క్రమంలో 8 లక్షల నుంచి పది లక్షల ఆస్తి అపహరణకు గురైనట్లు బాధితుడు ఉమామహేశ్వర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం ను రప్పించి వేలిముద్రలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో క్లూస్ టీం సీఐ శ్రీధర్, పరకాల సిఐ, ఎస్ఐ లు, పోలీసులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles