Thursday, April 3, 2025

ఆస్పత్రి దారి ఇరుకు..! అంబులెన్స్ కు దారెట్ల దోరుకు..! -నడిరోడ్డు మీదనే వాహనాలు -కూరగాయల వ్యాపారులు -రోడ్డు వెడల్పుకు మసి పూసిన నేతలు

పరకాల ప్రత్యేక ప్రతినిధి, ఫిబ్రవరి 6 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల సివిల్ ఆస్పత్రికి వెళ్లే రహదారి ప్రస్తుతం ఇరుకుగా మారింది. దాంతో నిజం కాలంలో నిర్మించిన సర్కారు దావఖానకు బాధితులను చేర్చే దారి లేకుండా పోయింది. కూరగాయల మార్కెట్ నుంచి సర్కార్ దావఖానకు తొలుత మార్గం. ఆ రహదారిలో అనేకులు భవనాలు నిర్మించుకొని తమ వ్యాపారంలు కొనసాగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వ్యాపారుల వద్దకు వచ్చేవారు నడిరోడ్డు మీదనే వాహనాలు నిలపడం గమనార్హం. దీనికి తోడు కూరగాయల వ్యాపారుల సైతం రోడ్డు వారగా అమ్మకాలు జరుపుతుండడంతో దారి ఇరుకుగా మారిపోయింది. దీంతో అంబులెన్స్ కు దారి మళ్ళించి సిఎస్ఐ రోడ్డు గుండా చుట్టూ తిరిగేలా చేశారు. ఇదిలా ఉండగా ఆస్పత్రికి తూర్పు- పడమర దిక్కులకు ఉన్న గేట్లలో పడమర గేటును శాశ్వతంగా మూసివేసి పోస్టుమార్టం గదిని నిర్మాణం చేశారు. దాంతో అంబులెన్స్ కు దారేదoటే.. నీ ముక్కు ఎక్కడ అంటే తల చుట్టూ చేతిని చూపించిన చందంగా మారింది. దీంతో అంబులెన్స్ సర్కారు దవఖానకు చేరడానికి వ్యవధి పడుతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ ను తొలగించి దారి చేయాలి  – పలువురి డిమాండ్ సర్కార్ దవాఖానకు వెళ్లే మార్గంలో ఉత్తరం వైపున ఆస్పత్రి, దక్షిణం వైపున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఎమ్మార్వో కార్యాలయాలు ఉన్నాయి. అయితే పరకాల- హనుమకొండ రహదారిలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ చోట దారిని వదలకకపోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతున్నది. ఆస్పత్రికి వెళ్లాలన్నా, క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుర్భర పరిస్థితులను నాటి పరిపాలకులు కల్పించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్డును వెడల్పు చేయాలనే ఆదేశాలు ఇచ్చి ఇరువైపులా ఐదు ఫీట్లు ఇళ్లను కూల్చివేయాలని నిర్దేశించి నప్పటికి ఏళ్లు గడుస్తున్న అమలుకు నోచుకోకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు నేతలు ఆ వ్యాపారులతో కుమ్మక్కై రోడ్డు వెడల్పుకు మసిపూశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు.. సర్కార్ దవాఖానకు దారి కల్పించండి.. బాధితుల ప్రాణాలు కాపాడండి.. అంటూ జనం కోరుతున్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles