పరకాల ప్రత్యేక ప్రతినిధి, ఫిబ్రవరి 6 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని శారద గురుకులంలో చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పాఠశాల వేధింపుల వల్లనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు విన్నపిస్తున్నాయి. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఊరుకొండ కార్తికేయ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇటీవల ప్రవేట్ పాఠశాలలో రక్షణ చర్యలు లేకపోవడంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఉదంతాలు కోకొల్లలు. అయినా ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారికి ప్రధాన ఫీజులు వసూళ్లు పైకే మక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థి మృతి పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. యజమాన్య వేధింపులా లేక ఇతర కారణాల అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల హాస్టల్ లో ఇద్దరు అమ్మాయిలు హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి.