PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

కౌకొండ గ్రామ హత్య కేసులో ఒకరి అరెస్ట్: ఏసిపి కిషోర్ కుమార్

పరకాల, ఫిబ్రవరి 01(పిసిడబ్ల్యూ న్యూస్): హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని కౌకొండ గ్రామంలో జనవరి 30న మేకల యుగంధర్ ను హత్య చేసిన కేసులో మేకల సిద్ధు S/0 (కుమారస్వామి) ని అరెస్టు చేసినట్లు ఏసిపి కిషోర్ కుమార్ తెలిపారు. గురువారం ఏసిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏసిపి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. గురువారం సిఐ మల్లేష్ యాదవ్ నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో గల ఏపీ 36 ఏటి 1532 మోటార్ సైకిల్ తో తారాసపడగా, పట్టుకునే క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా.. పట్టుకొని, అరెస్టు చేశామని, వివరాల్లోకి వెళ్తే.. జనవరి 30న నడికూడ మండలంలోని కౌకొండ గ్రామంలో ని, బాబాయి వరుస అయిన మేకల యుగంధర్ తో.. మేకల సిద్ధుకు భూ తగాదా విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యుగంధర్ బతికుంటే నాకు భూమి దక్కదనే.. అక్కసుతో అనాలోచిత ఆలోచనతో జనవరి 30న మేకల యుగంధర్ ను గొడ్డలితో నరికి హత్య చేసి పారిపోయాడని, కాగా గురువారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మేకల సిద్ధును పట్టుకొని అరెస్టు చేశామని, నిందితుని కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసిపి కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్ఐ అశోక్, పోలీసులు పాల్గొన్నారు.