కౌకొండ లో వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా..?
నడికూడ మండలం దామెర పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి కౌకొండ గ్రామంలో అంబేద్కర్ సెంటర్ వద్ద మేకల యుగేందర్(30) అనే వ్యక్తినీ గొంతుకోసి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న యుగేందర్ ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. యుగేందర్ ను హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే యుగేందర్ ను మర్డర్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీని mgm హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.