ఇదో.. బిల్లల జూదం ఆట! -మూడు బిల్లలతో జేబులు గుల్ల! -వేలాది రూపాయలు నష్టబోతున్నారు
పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల చెందిన నలుగురు సభ్యులతో కూడిన మూడు బిల్లలతో జూదం ఆట కొనసాగిస్తుంది. ఈ ఆట ప్రారంభంలో ఆ బృందంలోని సభ్యులు కాయ్.. రాజా కాయ్.. అన్న తరహాలో మూడు బిల్లలపై డబ్బులు విసురుతారు. వారికి అందులో విజయం లభిస్తుంది. డబ్బులు రెండింతలు అందిస్తారు. ఆ మూడు బిల్ల లలో రెండు నల్లవి కాగా ఒకటి ఎరుపు రంగు. ఎరుపు రంగు బిల్ల పై డబ్బులు విసిరిన వారు విజేతలుగా నిలుస్తారు. అంతకుముందు ఆ జూదంలో గెలిచినవారు జనం కూడా గానే తిరిగి అందులో చేరిపోతారు. అంతకు వారు విజేతలుగా నిలిచారని భావించిన ఇతరులు వారు ఏ బిల్లా మీద డబ్బు వేశారు దానిపైనే వేస్తుంటారు. అది ఎరుపు బిళ్ళ కాకపోవడంతో డబ్బులు పోగొట్టుకుంటారు. ఇలా పశువుల సంతల కాడా మూడు బిల్లలాట కొనసాగిస్తుంటారు. గొర్రెలు, పశువులు, అమ్మడానికి, కొనడానికి వచ్చిన వారు ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకొని విషాద వదనాలతో వెళ్లడం గమనార్హం. అలాగే కొత్త సినిమా వచ్చిన రోజున రద్దిని చూసి మూడు నాలుగు రోజులు అక్కడే మూడు బిల్లల జూదం కొనసాగిస్తుంటారు. ప్రధాన జాతరలు కూడా అడ్డాలే! ఈ ప్రాంతంలో జరిగే ప్రధాన జాతరలో వీరు బిల్లాలాట కొనసాగిస్తూ వేలాది రూపాయలు గడిస్తుంటారు. అందులో సంబంధిత అధికారులకు సైతం ఒప్పందం ప్రకారం మాముళ్ళు ముట్టు చెబుతుంటారు. లేకుంటే నిషేధం ఉన్న ఆ జూదం ఆటను బహిరంగంగా ఎలా నిర్వహిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మూడు బిల్లలాట నిర్వాహకుడు ఒప్పందం ప్రకారం ఇవ్వకపోతే అతడికి తమదైన రీతిలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం పరకాలలో మూడు బిల్లల జూదం ఆట నిరాటంకంగా కొనసాగుతుండడం పట్ల పలువురు గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనేది ఇక్కడ చర్చ జరుగుతుంది.