Thursday, April 3, 2025

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తా.మంత్రి అనసూయ( సీతక్క)

పిసిడబ్ల్యూ న్యూస్ హనుమకొండ జిల్లా స్టాపర్: ములుగు జిల్లాలోని గుర్తురు గ్రామ పంచాయితీ నూతన భవనమును ఆదివారం పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ( సీతక్క) ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, పూల వర్షంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ. మారుమూల గ్రామాల అభివృద్ధికి అభివృద్ధికి నోచుకోని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని, గుర్తుర్ తండా లో గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకు వచ్చిన భూములకు పట్టాలు, పంటలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటానని, అదే విధంగా గ్రామాల్లో సీసీ రోడ్లు సమస్యలకు త్వరలో పరిష్కరిస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటిలను పక్క అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిరుపేదలను గుర్తించి ఇల్లు రూ.5 లక్షల తో కట్టిస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశామని, ఇంకా 4 గ్యారంటిలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. కెసిఆర్ 10 యేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బి ఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమం కోసం పనే చేసే ప్రభుత్వం అని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నామని, మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ ఐఎఎస్, డిపిఓ,ఐటిడిఎ ఈఈ, డిఈ,గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్,గ్రామ కార్యదర్శి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles