Saturday, March 7, 2026

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి. ఏసిపి కిషోర్ కుమార్

పిసిడబ్ల్యూ న్యూస్ దామెర ప్రతినిధి: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరిస్తామని పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ హెచ్చరించారు. దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం పరకాల ఏసీపి కార్యాలయంలో కిషోర్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలని ఎవరైనా రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రౌడీయిజం మానేసి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఉండాలన్నారు. ఏసిపి వెంట పరకాల రూరల్ సీఐ మల్లేష్, ఎస్సై కోంక అశోక్ ఉన్నారు.

Related Articles

Latest Articles