Thursday, April 3, 2025

బస్సులో పొగలు..ప్రయాణికుల భగభగలు పరకాలలో అర్ధాంతరంగా నిలిచిన బస్సు

పరకాల: భూపాలపల్లి నుంచి హనుమకొండ పే బయలుదేరిన బస్సు పరకాల బస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే పొగలు విర జిమ్మింది. దీంతో ప్రయాణికులందరూ భయాందోళనకు గురై బస్సులో నుంచి వచ్చారు. ఈ క్రమంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెంబర్ టీఎస్ 25 జెడ్ 0010 హనుమకొండ కు వెళ్లాల్సి ఉంది. బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. రాత్రి సమయం కావడంతో తమ గమ్యస్థానాలకు చేరుకోవడం ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని సద్ది చెప్పినప్పటి కి ప్రయాణికులు ససిమేరా అంటూ నిలదీతకు పాల్పడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును పరకాల డిపోలో మరమ్మతు చర్యలు తీసుకువెళ్లడం గమనార్హం.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles