PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూపాయలు 10 లక్షలు పెంచాం. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయబోతున్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఫిబ్రవరి నెలకారు నాటికి రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా వేస్తాం.ఎవరు ఆందోళన చెందొద్దు అని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.అవినీతి పరులను,కోటీశ్వరులను, కెసిఆర్ రాజ్యసభకు పంపించారు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్ళమని టిఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు కెసిఆర్ కుటుంబాన్ని అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.