మరిపెడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పిఆర్ టియుటిఎస్ 2024 సంవత్సర డైరీని ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసన సభ్యులు జాటోత్ రాంచంద్రునాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టీయు రాజీలేని పోరాటం చేస్తుందని, ఉపాధ్యాయుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, సంఘ బాధ్యులు రాంమోహన్, శంకర్,వెంకన్న, ప్రేమ్ సాగర్, సురేష్, బాబురావు, విజయలక్ష్మి,మేరీశీల తదితరులు పాల్గొన్నారు.