పరకాల: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన సందర్భంగా ఎవరైనా క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరకాల డివిజన్ పరిధిలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు.