Thursday, April 3, 2025

కులంపేరుతో దూషిస్తూ దాడిచేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలి..

పిసిడబ్ల్యు న్యూస్ ఖమ్మం: ఎటువంటి ఫిర్యాదు లేకుండానే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కులంపేరుతో దూషిస్తూ దాడిచేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని గోపి వినయ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వినయ్‌కుమార్ మాట్లాడుతూ…జనవరి 14న పాలేరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో వీది కుక్క రెండు సవంత్సరాల బాలుడిని తీవ్రంగా కరచి గాయపరచడంతో కాలనీ వాసులు ఆవేధనతో అధికారులు పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో రంగస్థలం వాట్సాప్ గ్రూపులో వస్తే నేను కూడా స్పందించి గ్రామ సెక్రటరీ, మిగతా సిబ్బంది తక్షణమే స్పందించి కుక్క కరచిన బాలుడికి చికిత్స అందించాలని, కుక్కల బెడద లేకుండా నివారణ నిమిత్తం జిల్లా అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని వాట్సాప్ గ్రూపులో మెస్సేజ్ చేశాను. జనవరి 16న కూసుమంచి పోలీస్ అధికారి రాత్రి 7 గంటలకు పిలిపించి కుక్క కరిస్తే నీ కెందుకురా అని దుర్భషలాడి మాదిగ కులంపేరుతో దూషించి కొట్టాడని వినయ్‌కుమార్ ఆరోపించాడు. దూషించి కొట్టిన పోలీస్ అధికారి వలన నాకు ప్రాణభయం ఉందని, అక్రమ కేసు పెట్టైనా జైలుకు పంపుతాడని భయపడి ఇట్టి విషయమై జిల్లా సిపి, రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపాడు. జిల్లా అధికారులు విచారణచేసి సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విలేకరుల సమావేశంలో రాంబాబు, రవీంద్రనాయక్, భద్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles