Thursday, April 3, 2025

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ కరువు!

డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ కరువు!
-కాలం చెల్లిన మెడిసిన్ విక్రయాలు
-పైగా అధిక ధరలు
-జనరిక్ మందుల పై అవగాహన కల్పించరు
– తనిఖీ చర్యలు శూన్యం పరకాల ప్రాంతంలోని మెడికల్ షాపులలో అధిక ధరలకు మెడిసిన్ అమ్ముతున్న పట్టించుకున్న నాధుడు లేడు. కనీసం నామమాత్రంగానైనా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసిన దాఖలు లేవని పలువురు వ్యాధిగ్రస్తులు చెబుతున్నారు. వైద్యులు రాసిన మందులు లేకపోవడంతో అలాంటి కాంబినేషన్లో మందులు ఇస్తున్నారు. అవి కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాలలో కాలం చెల్లిన మందులను అంటగడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నమ్మకం ఉన్న మెడిసిన్ షాప్ కు వెళ్తున్న వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా మందులు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జనరిక్ మందుల పై అవగాహన కల్పించరా? ఇప్పటివరకు డ్రగ్స్ అధికారులు గానీ వైద్యశాఖ అధికారులు గానీ ప్రజలకు జనరిక్ మందుల వాడకంలో అవగాహన కల్పించడంలో ఎలాంటి ముందడుగు వేయలేదని ఆరోపణలు వెళుతున్నాయి. ఆ మందులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లయితే బాధితులు చైతన్యవంతులు అవుతారని అభిప్రాయపడుతున్నారు. లైసెన్స్ పొందిన వారే డ్రగ్స్ అమ్మాలని ఆదేశాలున్న ఆచరణ శూన్యమని అంటున్నారు. కొన్ని వ్యాధులకు మత్తునిచ్చే మెడిసిన్ అవసరం. అలాంటి వాటిని కొందరు యువత మత్తు కోసం వాటిని తీసుకున్నారనే ఆరోపణలు పరకాల ప్రాంతంలో అనేకం. పర్యవేక్షణ లేకపోవడంతో అవగాహన లేని యజమానులే ఫార్మసిస్టులుగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ అధికారులు మెడికల్ షాపులను తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని పరకాల ప్రాంతవాసులు కోరుతున్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles