Thursday, April 3, 2025

పదవి విరమణ చెంది, తిరిగి ఉద్యోగం పొందిన వారిపై విచారణ జరిపించాలి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతోందని, ఈ పది సంవత్సరాలలో రిటైర్డ్ ఉద్యోగులకు రీ- ఎంప్లాయిమెంట్ కల్పించడం ద్వారా వేల కోట్ల రూపాయలు జీతాల రూపేనా చెల్లించడం జరిగిందని, అంతేకాకుండా కార్లు, హౌజ్ రెంట్, మెయింటెనెన్స్ ఆలవెన్సులు వారి అటెండర్లు, ఇంట్లో పని చేసే వర్కర్స్, ఇతర ఆలవెన్సులు వెల కొట్లలలోనే వున్నాయని, ఈ విధంగా గత ప్రభుత్వoలోనీ 10 సంవత్సరాల కాలంలో 16000 వేల కోట్ల రూపాయలు జీత భత్యాల కిందనే చెల్లించడం జరుగుతోందని, వీటిపై విచారణ చేపట్టి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ చైర్మన్ వికలాంగుల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, మాజీ ఏ ఐ సి సి సభ్యులు బక్క జడ్సన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. ఉదాహరణకు స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డికి నెలకు రూ. 350000 వేల రూపాయలు జీతము, రెండు కార్లు, ఒక కారు ఇంటికి, మరో కారు ఆయనకు, ఈయనతో పాటు రాజారావు, రవికుమార్, నర్సింహా రెడ్డి, బి.విద్య సాగర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఏ.రమేష్ యం.డి, విద్య సాగర్ రెడ్డి డ్రైవర్, అటెండర్లు ఈయనతో పాటు మాజీ మంత్రి దయాకర్ రావు ఇంట్లో పని చేసే వర్కర్స్ అందరి జీతాలు మహిళ సంఘాల డబ్బులు అయిన స్త్రీ నిధి సంస్థ ద్వారానే చెల్లించడం జరిగింది కాబట్టి, వెంటనే స్త్రీ నిధి సహకార సమాఖ్య సంస్థ పై సెక్షన్-51 విచారణ జరిపించాలని, అదే విధంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శాఖలో ప్రకాష్ రావు, అబ్బాస్ అలీ, గౌతమ్ పింగిలి, జగన్మోహన్ గౌడ్, తిరుపతయ్య తదితరులు జీతం అలవెన్స్ల రూపేణ వారికి కోట్ల రూపాయలు చెల్లించడం విమర్శించారు. తక్షణమే వీళ్ళందర్నీ విధుల నుంచి తప్పించి ఆడిట్, ఏసీబీ, విజిలెన్స్ శాఖ అధికారులతో ఎంక్వయిరీ జరిపించి వీరి వలన ప్రభుత్వానికి జరిగిన నష్టము, లూటీ అయిన ప్రజాధనం లెక్కగట్టి, దోషులను తేల్చి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి, అట్టి రూపాయలను రికవరీ చేయుటకు ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ ఉద్యోగులను వెంటనే తొలగిస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపాదికన ప్రమోషన్లు ఇవ్వబడతాయని, అదేవిధంగా 30 లక్షల మంది నిరుద్యోగుల్లో పదివేల మందికి వెంటనే ఉద్యోగాలు లభిస్తాయి కావున ప్రభుత్వము తక్షణమే ఈ విషయమై తగిన చర్యలు తీసుకొని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని బక్క జడ్సన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles