మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు. సీఐ దాసరపు వేణుచందర్..
చిట్యాల మండల కేంద్రంలోని శివాజీ సెంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని చిట్యాల సీఐ దాసరపు వేణు చందర్ ఆధ్వర్యంలోని విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని పది వాహనములకు చలానాలు విధించి అలాగే నంబర్ ప్లేట్లు లేని రెండు వాహనాలను సీజ్ చేసి మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తుల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సిఐ దాసరపు వేణు చందర్ మద్యం తాగి వాహనాలు నడుపుతే కేసులు నమోదు చేస్తామని వాహనదారులు సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహన నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణించరాదని లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్యాల ఏఎస్ఐ మధుసూదన్ హెడ్ కానిస్టేబుల్స్ యాకయ్య,గౌస్ ,వీరారెడ్డి ,రవి మరియు కానిస్టేబుల్స్ లాల్ సింగ్, నవీన్, ప్రశాన్లు పాల్గొన్నారు.