Saturday, March 7, 2026

మేడిపల్లిలో డబల్ బెడ్ రూమ్, వాటర్ సమస్య పరిశీలించిన జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత..

పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. అడిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.1 వాటర్ సమస్య వాటరు రాక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు. అని ప్రజలు చెప్పడం జరిగింది.తక్షణమే ప్రజల అందరికీ వాటర్ అందేలా చూడాలని కార్యదర్శికి వారు చెప్పడం జరిగింది. 2 డబుల్ బెడ్ రూమ్ పరిశీలించారు. ఎవరైతే గోడలు కట్టుకున్నారో వారికి డబ్బులు ఇవ్వాలని వారు హామీ ఇచ్చి చెప్పడం జరిగింది. గ్రామస్తులు అప్పుడు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాకేష్, చింతల పోశయ్య, బోదే ఓదెలు,గుంటి లక్ష్మణ్, పెరుమండ్ల రాజేందర్, గాదే మల్లయ్య, మేకల పోశయ్య, పెరుమండ్ల రమేష్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles