Wednesday, July 22, 2026

గాంధారి మండలంలో విషాదం దంపతుల ఆత్మహత్యాయత్నం.

తెలంగాణ/కామారెడ్డి-గాంధారి-పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమావరం తాండ కు చెందిన దంపతులిద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో సోమారంతండా సర్పంచ్ కిషన్ నాయక్ కు చెందిన 240 గజాల స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన డబ్బు కూడా మొత్తం చెల్లించామని, అయినా ఆ స్థలాన్ని కిషన్ నాయక్ తమకు రిజిస్ట్రేషన్ చేయడంలేదంటూ మనస్తాపంతో బానోత్ శంకర్, సునీత్ అనే దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో వారిని వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Latest Articles