Thursday, April 3, 2025

స్వేరోస్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుక, విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ..

స్వేరోస్ నెట్వర్క్ ఫౌండర్ మాజీ గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదిన వేడుకలను హనుమకొండ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు *శనిగరపు రాజేంద్రప్రసాద్* ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞాన సమాజ నిర్మాణమే ధ్యేయంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో అణగారిన పిల్లలకు విద్యా ప్రాముఖ్యతను తెలియజేసి చదువే ఆయుధంగా మలుచుకొని చదువుతోనే జీవితాలు బాగుపడతాయి అని ప్రతి ఒక్కరికీ విద్య అందాలి, ఎదగాలి, స్థిర పడాలనే నినాదంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల చదువుల కోసం స్థాపించిన సంస్థ స్వేరోస్ నెట్వర్క్ ని అన్నారు. ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్న కాలంలో విద్యార్థులకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ భద్రాద్రి జోన్ అధ్యక్షులు ఒంటెరు చక్రి, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇంద.రాజ్ కుమార్ ,హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు దొగ్గల వినయ్, మాదారపు నవీన్, జాయింట్ సెక్రెటరీ మంద మనోజ్, శనిగరపు సాజన్, కోగిల కిరణ్ ,పెండ్యాల విక్రమ్, సుభాష్ ,వేణు, రాజేష్, రమేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles