Thursday, April 3, 2025

ప్రైవేటు హాస్పిటల్లో దోపిడిని అరికట్టాలి: డివైఎఫ్ఐ..

ప్రైవేటు హాస్పిటల్లో దోపిడిని అరికట్టాలి: డివైఎఫ్ఐ
హనుమకొండ: వైద్యం పేరుతో ప్రవేటు హాస్పటల్ చేస్తున్న దోపిడీ అరికట్టాలని *డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి* డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేటు హాస్పిటల్లో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. 2011 మెడికల్ ఎస్టాబ్లేషన్ చట్టం ప్రకారం ప్రవేటు హాస్పిటల్స్ నిబంధనలు పాటించాలని చెప్తున్నప్పటికీ ఏ హాస్పిటల్స్ నిబంధనలను పాటించకుండా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి, హాస్పిటల్ కి వచ్చే రోగులనుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తూ నిలబడి దోపిడీ చేస్తున్నారు, జిల్లాలో వైద్యాధికారులు ప్రైవేటు హాస్పటలను తనిఖీలు నిర్వహించినప్పటికీ నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు ఏ హాస్పిటల్లో పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ అధికారుల అండదండతోనే ప్రైవేటు హాస్పిటల్ రెచ్చిపోతున్నాయని,కొన్ని హాస్పటల్లో డిస్ప్లే చేసిన ఫీజుల వివరాలు కాకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ కనీసం ఫీజు వివరాలు డిస్ప్లే చేయలేదు, ప్రైవేటు హాస్పిటల్ లకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ, వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలను దోచుకుంటున్న హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు దాసరి నరేష్, నాయకులు మాటూరి సతీష్, ఎం. వినయ్, ఎస్. రమేష్, కే. భాస్కర్, ఎం. రమేష్, కే.రాజు, పాణి, ఓదెల్ పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles