Saturday, March 7, 2026

నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు భయపడాలి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బరంఏడ్గి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది తనను పనిగట్టుకొని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. పత్రికల ద్వారా తనను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని అవసరమైతే హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తనపై ఆరోపణలు చేసిన వారు సిద్దమా అని ప్రశ్నించారు. తను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటే ఉంటానని తనే నాకు దేవుడు, గురువు అని స్పష్టం చేశారు. తనను బ్లాక్మెయిల్ చేస్తే భయపడేది లేదన్నారు. మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్.

Related Articles

Latest Articles