గిరిజన ఆశ్రమ స్పోర్ట్స్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన మంత్రి..
తెలంగాణ మహబూబాబాద్ న్యూస్ ప్రతినిధి: జిల్లా కలెక్టర్, అధికారులు, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడిన మంత్రి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిడి తో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాల చేరుకుని ఫుడ్ పాయిజన్ గల కారణాలు, అక్కడి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు అనంతరం డియంఅండ్ హెచ్ఓ హరీశ్ రాజ్ తో ఫోన్ లో మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆదేశించారు. కొత్తగూడె టిఆర్ఎస్ అధ్యక్షులు వేణుతో పాటు అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి, విద్యార్థులు పూర్తిగా కోలుకునే వరకు దగ్గరుండి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులకు ప్రస్తుతం చికిత్స అందుతుందని, వారు క్షేమంగానే ఉన్నారని మంత్రి తెలిపారు.