నర్సింహులపేట పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: రైతులకు వరికి కనీస మద్దతు ధర 2500 గిట్టుబాటు ధర కల్పించాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్వరాజ్య స్థాపన కోసం చేపట్టిన పది వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఆయన మండల కేంద్రానికి చేరుకున్నారు.మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిఎస్పి జెండాలను ఆవిష్కరించారు.అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా మోసపూరిత వాగ్దానాలతో మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నట్లు ఆయన తెలిపారు.కనీసం రైతులకు టర్పాలిన్ పట్టాలు కూడా అందజేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.90 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలను పక్కనపెట్టి కేవలం 10 శాతం ఉన్న అగ్రకులాల నాయకులు మాత్రమే అధికారం చేపడుతున్నారని తెలిపారు.పోరాటాల ద్వారానే స్వరాజ్య స్థాపన సాధ్యమవుతుందని బడుగులంతా ఏకమై ప్రభుత్వాన్ని సాధించుకోవాలని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్ మహరాజ్,జిల్లా కన్వీనర్ సుధాకర్,జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి శ్రీకాంత్, మండల అధ్యక్షుడు దేవేందర్,దంతాలపెల్లి ఇంచార్జి వెంకన్న తదితరులు ఉన్నారు.