శ్రీ ధర్మశాస్త్ర గోశాలలోని గోవులకు పశుగ్రాసం వితరణ
తెలంగాణ/పెద్దపల్లి.సుల్తానాబాద్:పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం యాదవ నగర్ లోని శ్రీధర్మశాస్త్ర గోశాలలోని ఆవులకు గ్రాసం నిమిత్తం బావు రాజేందర్ – తిరుమల ఆరేపల్లి గ్రామస్తులు పెళ్లిరోజు సందర్భంగా 120 గడ్డి కట్టలను,సుల్తానాబాద్ కు చెందిన వాసాల శ్రీలత -శీను వారి కుమారుడు శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 80 గడ్డి కట్టాలను, సుల్తానాబాద్ కు చెందిన
నాగుల విజయలక్ష్మి-కుమార స్వామి, వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు బూదమ్మ- కీర్తిశేషులు నరసయ్య జ్ఞాపకార్థం 60 గడ్డి కట్టలను ఆదివారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గో సేవ ఎంతో గొప్ప కార్యక్రమని వాటికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన శ్రీ ధర్మశాస్త్రగోశాల ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.ఇతరులు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గోమాతలకు గ్రాసరూపకంగాను సహాయం అందించగలరని అన్నారు.గోశాలకు గ్రాసం అందించిన సభ్యులకు,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శాలువా తో సత్కరించి,గోమాత ప్రతిమను ఫౌండేషన్ సభ్యులు అందించారు.ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు బండారి సూర్య, ప్రధాన కార్యదర్శి నూక రాందాస్, ట్రెజరర్ బండారి భాగ్యలక్ష్మి ,సంఘ సభ్యుడు రాజకుమార్,తదితరులు పాల్గొన్నారు.