మత్స్యకారులు సంఘటితంగా ఎదగాలి మత్స్యకారుల సొసైటీ ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ..
నర్సింహులపేట పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: మత్స్యకారులు సంఘటితంగా ఎదగాలని నర్సింహులపేట మత్స్యకారుల గ్రామ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ అన్నారు.సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నప్పటికిని వృత్తి దారులకు చొరవ చూపాలని ఆయన అన్నారు. మత్స్య పరిశ్రమకు ప్రత్యేక నిధులు అందించాలని అన్నారు. మత్స్యకారుల కుటుంబాలు చేపల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.యువత సొసైటీల సభ్యత్వం తీసుకొని ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు మంద చిన్న సాయిలు,గడ్డం వెంకన్న,రావుల వెంకెన్న,చెన్నబోయిన వెంకన్న, మంద సత్యం,చెన్నబోయిన చంటి నర్సయ్య,మంద ఎర్ర నర్సయ్య,సుంకరి సాంబయ్య,కోల రామయ్య,సుంకరి ఉప్పలయ్య తదితరులు ఉన్నారు.