Wednesday, July 22, 2026

ఓదెల మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల కారుకు ప్రమాదం

తెలంగాణ/పెద్దపల్లి.ఓదెల:పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని హరిపురం గ్రామంలో కాంట్రాక్టర్ అధికారల నిర్లక్ష్యంతో రోడ్డు మరమ్మత్తులు సరిగా లేకపోవడం వలన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం రోజు హైదరాబాదు నుండి ఓదెల మల్లికార్జున దర్శనం కోసం వస్తున్న భక్తుల కారు మూల మలుపు దగ్గర అదుపుతప్పి గొయ్యి లో కారు పడి పోయింది.కారులో ఉన్న భక్తులు అరపులతో గ్రామంలో ఉన్న గ్రామస్తులు చేరుకొని కారు తలుపులు తీసి వారిని బయటకు దింపేశారు.రైల్వే కాంట్రాక్ట్ నిర్లక్ష్యానికి కారులో ప్రయాణిస్తున్న యాత్రికుల స్వల్ప గాయాలతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా రైల్వే అధికారులు కాంటాక్ట్ పై చర్యలు తీసుకొని రహదారి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా ప్రజలను, ప్రయాణికులను రక్షించాలని సర్పంచ్ ఉండేటి మధు యాదవ్ డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles