PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లలకు విద్యాభ్యాసం తప్పనిసరి

తెలంగాణ/పెద్దపల్లి. సుల్తానాబాద్/పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి

బ్రతుకుదెరువుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు చెందిన చిన్నారులతో పనులు చేయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రూపేష్ ఐపీఎస్ తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇటుక బట్టీల యజమానులతో సమావేశం నిర్వహించారు. బ్రతుకుదెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన వారికి సౌకర్యాలు కల్పించే బాధ్యత యజమానుల పైనే ఉందని అన్నారు. ఇటీవల ఇటుక బట్టీలు సందర్శించినప్పుడు చిన్నారులు పనిచేస్తూ కనిపించారని మైనర్లతో పని చేయించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటుక బట్టే ఆవరణలోనే విద్యార్థులకు తరగతి గదులు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించుకోవాలని అన్నారు. కార్మికులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. త్వరలోనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇటుక బట్టీల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ రావు, మహిళా ఎస్సై వినీత, పోలీస్ సిబ్బంది, ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.