Thursday, April 3, 2025

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105 వ జయంతి వేడుకలు..

తెలంగాణ/కామారెడ్డి జిల్లా పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. అనంతరం రైల్వే చౌరస్తాలో గల ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కైలాస్ శ్రీనివాసరావు గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అయిరేని సందీప్ గార్లు మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధీ గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారి అభివృద్ధికి దోహదపడింది. గరీబి హటావో నినాదంతో పేద ప్రజలను ఆర్థి కంగా ఎదగడానికి కృషి చేసినది. అలాగే నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం గానీ, వ్యవసాయదారులకు అన్ని రంగాలలో సహాయ సహకారాలు అందించింది. ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయశ్రీ. జవహర్లాల్ నెహ్రూ గాని . స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గాని. శ్రీ రాజీవ్ గాంధీ గాని. స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారి కానీ చేసిన సంక్షేమ పథకాల వల్లనే ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలను విస్మరిస్తున్నారు. అయ్యా రాబోయే రోజులలో ఇటు బిజెపి కి గాని, అటు టిఆర్ఎస్కు గాని, ప్రజలేతగిన గుణపాఠం చెబుతారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు. మాజీ కౌన్సిలర్లు రవీందర్ గౌడ్, గోని శ్రీనివాస్, బట్టు మోహన్, కా రంగుల అశోక్ రెడ్డి, సిరాజుద్దీన్, సర్వర్, సయ్యద్ సాజిద్, అతిక్, ఎజాచ్ రవి,శంకర్,ఎజాజ్, సాజిద్, లక్కపతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles