ములుగు ఆదివాసీ తెగలకు పోలీస్ బాస్ లు చేయూత..
ములుగు జిల్లా లోని హెడక్వార్టర్స్ నందు జిల్లా డాక్టర్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారు మాట్లాడుతూ భారత సమాజంలో ఆదివాసీ పాత్ర ఎంతో ఉందని వారు మన సమాజంలో బాగమని — బ్రిస ముంద జయంతి సందర్బంగా ములుగు జిల్లా లోని అన్ని ఆదివాసీ గుత్తికొయా తెగల ప్రజలను చలికాలంలో ఆదుకునే ఉద్దేశంతో నాణ్యమైన 2000 బ్లాంకెట్స్ ను ఈ కార్యక్రమంలో భాగంగా పంచడం జరిగిందని అన్నారు. ఈ వారంలో అనేక ఆదివాసీ సంక్షేమ కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చేపట్టడం జరిగింద్దన్నారు దీనిలో భాగంగా పస్రా నందు గల PSR గార్డెన్ లో చేపట్టిన ఉచిత మెగా క్యాంపు కు భారీ స్పందన లభించిందని సుమారు గా 1500 మంది , ఏటూరునాగారం ఉచిత మెడికల్ క్యాంపు కు 2000 మంది తరలి వచ్చి అన్ని రకాల పరీక్షలు చేయించుకొని మెడిసిన్స్ ఉచితంగా పొందారని ఇంకా రాబోవు కాలంలో ఆదివాసీ తెగల అభ్యున్నత్తికై అనేక కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చేపడతాం అని చెప్పారు.ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద సఫలం కావడానికి ఓ ఎస్ డి గౌస్ ఆలం ఐపీఎస్ ఏ ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గార్ల ఆధ్వరియంలో గల టీమ్స్ చేసిన కృషి ఫలితంగానే ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు సీఐ రంజిత్ కుమార్ ఆర్ ఐ అడ్మిన్ రాధారపు స్వామి, డి.ఎస్.బి సెకండ్ సీఐ రాజు గార్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.