జర్నలిజం వృత్తి చాల పవిత్ర మైంది. మార్కెట్ కమిటీ చైర్మన్ కె. సాయగౌడ్..
తెలంగాణ/కామారెడ్డి జిల్లా జుక్కల్ పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: జర్నలిజం వృత్తి ఎంతో పవిత్ర మైందని మద్నూర్ మార్కెట్ కమిటి చైర్మన్ కర్రెవర్ సాయగౌడ్ అన్నారు. బుధవారం జుక్కల్ మండల కేంద్రం లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పాత్రికేయ దినోత్సవ సందర్బంగా సన్మాన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయం లో జర్నలిస్ట్ ల పాత్ర చాల గొప్పదని గుర్తు చేశారు.జర్నలిస్ట్ లు సమాజ హితం కోసం తమ కలన్నీ, గళాన్ని ఉపయోగించి తాము నమ్ముకున్న వృత్తి నే ఆరాధ్యంగా భావించి ఎలాంటి స్వార్థం లేకుండా సాదాక బాధాకలు ఎదుర్కొంటూ తమ వృత్తి కి న్యాయం చేసేందుకు సమస్యలు వెలికి తీసి వర్తల్లో తను మొదటి గా నిలబడాలనే తాపత్రయం తో మాత్రమే విధులు నిర్వహిస్తుంటారే తప్ప వారి అనుభవిస్తున్న సాధాక బాధాకలు వర్ణించాలేనివాని పలువురు తమ అనుభవాలను కొనియాడారు.ప్రస్తుతం మీడియా రంగం లో చాల ఇబ్బందులు ఉన్నాయని ఎన్ని ఇబ్బందులు ఉన్న ఆ ఇబ్బందులను తమలో తామే దిగమింగు కుంటూ వృత్తే ప్రధానంగా పనిచేసే వారు కేవలం జర్నలిస్ట్ లు మాత్రమే అని సి పి ఎం నాయకుడు సురేష్ గొండ అన్నారు. వారి సమస్యలపై కూడ ద్రుష్టి సారించాలన్నారు. జర్నలిస్ట్ లందరికి ఇండ్ల స్థలాలతో పాటు డబులు బెడ్ రూమ్ లను నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు కృషి చెయ్యాలన్నా రు. ప్రస్తుత పోటీ ప్రపంచం లో కూడ జర్నలిస్ట్ లు ఐక్యంగా ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి, మండల అధ్యక్షులు జి. దాస్థిరం, ఉమాకాంత్ లు పేర్కొన్నారు. ప్రస్తుతతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ సమస్యలపరిష్కారనికి కృషి చేస్తుందని జుక్కల్ మండలం తోపాటు నియోజకవర్గం లోని జర్నలిస్ట్ లందరికి ఇండ్ల స్థలాలతోపాటు డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేసేల ఎమ్మెల్యే సహకారం తో తప్పకుండ కృషి చేస్తామని సాయగౌడ్ అన్నారు.కార్యక్రమం లో మండలం లోని సీనియర్ జర్నలిస్ట్ లు జె. వీరన్న, వాహబ్, సాయిలు, గంగాధర్ లతోపాటు పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లకు శాలువా, మెమంటో, గోల్డ్ మెడల్ లతో సన్మానం చేశారు.కార్యక్రమం లోజెడ్పి టి సి సభ్యురాలు లక్ష్మి బాయి దాదారావు పాటిల్, సొసైటీ చైర్మన్ శివానంద్,ఆర్ బి కె కేర్ టెకర్ డాక్టర్ విక్రమ్, జుక్కల్ తాసిల్దార్ గణేష్, ఎంపి ఓ యాదగిరి,పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బస్వంత్,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు చంద్రకాంత్, బాబు, ఎల్ ఎన్ గౌడ్, భూమన్న, నరేష్,మజి సర్పంచ్ బి. గంగాధర్ తోపాటు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.