కేజీబీవీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ డిమాండ్..
మహబూబాద్ జిల్లా/ కురవి /పి సి డబ్ల్యూ న్యూస్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కురవి మండలం నేరడలోని కేజీబీవీ ఎదుట బుధవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బొల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మూడు అంచెల పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని.. వారికి హెల్త్ కార్డులు జారీ చేయాలని.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.కాంట్రాక్టు వ్యవస్థ పేరుతో కేజీబీవీ ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని.. వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలు, సెలవు నిబంధనలు రూపొందించి అమలు చేయాలన్నారు, కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసిన చోట అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. ఎస్.ఓ.. లకు మోడల్ స్కూల్ హాస్టల్ నిర్వహణ బాధ్యతలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటిఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, కురవి మండల అధ్యక్షులు గుండ్ల విజయ్ కుమార్ సామాజిక కార్యకర్త జాని, జిల్లా కౌన్సిలర్ దైద వెంకటేశ్వర్లు.,సింగం మనోహర్, కడారి మల్లిఖార్జున్, గుగులోత్ వెంకన్న, శీలం వెంకటరాజు, బందేల బాలరాజు, పూర్ణ చందర్, కిరణ్ కుమార్, సరస్వతి, కళ్యాణి,సునీత, సుహాసిని,వాణి, స్వరూప, శ్రావణి,పవిత్ర, విజయ, జ్యోతి, వసంతదేవి, భవిత, రాజేశ్వరి పాల్గొన్నారు.