Thursday, April 3, 2025

నేర నియంత్రణలో నిఘానేత్రం పాత్ర చాలా కీలక వెల్గటూర్ ఎస్.ఐ నరేష్ కుమార్..

తెలంగాణ పి.సి.డబ్ల్యు.న్యూస్ ప్రతినిధి వెల్గటూర్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి, ఇతర రద్దీ ప్రాంతాల వద్ద సీ.సీ కెమెరాల ఏర్పాటు కోసం వెల్గటూర్ రక్షక బఠాధికారి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నేను సైతం నిఘానేత్రం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కూడలి వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశములో వ్యాపారస్తులకు, స్థానికులకు సీ.సీ కెమెరాలతో చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి మరియు నిందితుల కదలికలను పసిగట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. కూడలి వద్ద ఏర్పాటు చేసే సీ.సీ కెమెరా వందమంది పహారా కాసిన వారితో సమానంగా ఉంటుందని ఆయన తెలిపారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ఉప సర్పంచ్ గుండేటి సందీప్ రెడ్డి, సంఘం అధ్యక్షులు గోలి రత్నాకర్,వర్తక సంఘం అధ్యక్షులు రేగొండ రామన్న, నాయకులు కూనమల్ల లింగయ్య, పెద్దూరిభరత్ కుమార్ వ్యాపారస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles